ప్రశాంత్ వర్మ ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హనుమాన్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నాడు. హనుమన్ సినిమాతో సూపర్ హీరో యూనివర్సిటీ స్టార్ హీరోను చేసిన ప్రశాంత్ వర్మ ఆ సిరీస్ లో మరికొన్ని సినిమాలు చేయాలని ప్లాన్ లో ఉన్నారట. ఇప్పటికే ఈ యూనివర్స్ లో రెండు ప్రాజెక్ట్స్ లను అనౌన్స్ కూడా చేశారు. ఈ సినిమాలకు ప్రశాంత్ వర్మ నేరుగా దర్శకత్వం వహించనున్నారు.


పివిసియులో మరో సినిమాను అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ పివిసియులో మూడో సినిమాగా మహాకాళి అనే లేడీ సూపర్ హీరో సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశారు. కాగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా 2024 లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది. హనుమాన్ సినిమాకు రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.... రూ. 350 కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.


హనుమాన్ సినిమా భారతదేశంలో మొదటి రోజున రూ. 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా అత్యధిక వసూళ్లు చేసిన ఎనిమిదవ తెలుగు సినిమాగా నిలిచింది. ఇందులో తేజ సజ్జ హీరోగా నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జ హనుమాన్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.


ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు తేజా సజ్జ హనుమాన్ సినిమాతో హీరోగా పరిచయమే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, సత్య, వినయ్ రాయ్ కీలక పాత్రలను పోషించారు. అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తీసి ప్రశాంత్ వర్మ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరిన్ని సినిమాలతో అభిమానుల ముందుకు రానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: