అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-1, పుష్ప-2 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. పుష్ప సినిమా రెండు పార్ట్ లలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప-1 గత మూడేళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ముఖ్యంగా సమంత ఐటమ్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 


ఊ అంటావా మావ అంటూ సాగే ఈ పాటలో సమంత చాలా హాట్ గా తన అందాలను ఆరబోసి అభిమానులకు కనువిందు చేసింది. ఈ పాట ద్వారా పుష్ప-1 సినిమా మరింత విజయం అందుకుందని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప-2 సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు ఈ సినిమా 2వేల కోట్ల కలెక్షన్లను రాబట్టింది. పుష్ప-2 సిరీస్ లో స్పెషల్ సాంగ్ లో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల నటించింది.


ఇదివరకు ఎప్పుడూ చేయని విధంగా శ్రీలీల మొదటిసారిగా ఐటమ్ సాంగ్ చేసింది. ఇందులో శ్రీ లీల కిసిక్ అంటూ సాగే పాటలో తన అద్భుతమైన డ్యాన్స్ తీరుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కాగా, పుష్ప-3 సినిమా కూడా ఉంటుందని క్లైమాక్స్ లో రివిల్ చేశారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి.


అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. స్పెషల్ సాంగ్ లో ఈసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. జాన్వి కపూర్ డ్యాన్స్ చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-3 సినిమాలో జాన్వి కపూర్ ను పెట్టి స్పెషల్ సాంగ్ లో తీయాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: