ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రారంభం అయ్యింది. ఇక ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకొని.. మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ షోలో ఫ్యామిలీ ఎపిసోడ్ నిర్వహించారు. ఆ ఎపిసోడ్ లో అందరి జంటల ఫ్యామిలీలు వచ్చాయి. అప్పుడు తేజస్విని తనకు నాన్న లేరని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంది. అలాగే అందరి నాన్నలను చూసిన ప్రతిసారీ ఆమెకి వాళ్ల నాన్న గుర్తుకు వస్తారని ఆమె ఎమోషనల్ అయింది. నాన్న ప్రతి ఆడపిల్లకి ఫస్ట్ హీరో అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ వీడియో చూసిన ప్రేక్షకులు నీకు మేము ఉన్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
ఇక ఈ సీజన్ 3లో కూడా అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన యాంకర్ ఓంకార్ యే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి తొమ్మిది ఇస్మార్ట్ జంటలు అడుగుపెట్టాయి. ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు ఈ షోలో పాల్గొంటున్నాయి. అందులో సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. మొదటి నుండి ఇప్పటివరకు ఈ షోలో టాప్ జోడీగా అమర్ దీప్- తేజస్విని కొనసాగుతున్నారు.    
ఇక తెలుగు టీవీ షోలకు సంబంధించి తాజాగా 52వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. స్టార్ మా ఛానెల్ లో అటు సీరియల్స్ లో, ఇటు షోలలో ఇతర తెలుగు ఛానెల్స్ కు అందనంత ఎత్తులో ఉంటోంది. టీఆర్పీ రేటింగ్స్ లో ఆ ఛానెల్లో వచ్చే సీరియల్స్, షోలన్నీ తిరుగులేని రేటింగ్స్ తో దూసుకెళ్తున్నాయి. అయితే స్టార్ మాలో బిగ్ బాస్ ప్లేస్ లో వచ్చిన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడే టాప్ లో నిలవడం విశేషం. టాప్ 5లో ఇస్మార్ట్ జోడీ షో టాప్ 1 లో నిలిచి ప్రేక్షకుల మనసు మరోసారి గెలుచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: