ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో సైతం మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. 2025 బిగ్గెస్ట్ హిట్లలో నిలవడానికి కావాల్సిన అన్ని అర్హతలు వార్2 సినిమాకు ఉన్నాయనే సంగతి తెలిసిందే.
మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో 1000 కోట్ల కలెక్షన్ల సినిమాలు చేరాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తుండగా వార్2 సినిమా ఆ కలను నిజం చేస్తుందేమో చూడాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా నుంచి తారక్ లుక్ అధికారికంగా రిలీజ్ కాలేదు. తెలుగులో ఈ సినిమాకు యుద్ధభూమి అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వార్2 సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండగా అటు సౌత్ ఇటు నార్త్ లో కలెక్షన్ల పరంగా ఈ సినిమా సంచలనాలు సృష్టించనుంది. ఈ సినిమా తారక్31వ సినిమా కాగా ఈ మూవీ ఎలా ఉండబోతుందో అని ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.