సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు షూట్ సైతం మొదలుకాకుండానే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని అలాంటి కాంబినేషన్లలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
 
సినిమా షూటింగ్ కొంతమేర ఆలస్యమవుతోందని కామెంట్లు వినిపిస్తున్నా సినిమా మాత్రం 2025 సంక్రాంతికి కచ్చితంగా రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కి ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలేవీ 200 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తం కలెక్షన్లను అయితే సాధించలేదనే చెప్పాలి.
 
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఇప్పటివరకు తెరకెక్కిన సినిమాలన్నీ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కగా ఈ సినిమా మాత్రం మరో బ్యానర్ లో తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విషయంలో మేకర్స్ అస్సలు రాజీ పడటం లేదని తెలుస్తోంది. పుష్ప ది రూల్ మూవీ హిట్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ లో ఒకింత కాన్ఫిడెన్స్ ను నింపింది.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ విదేశీ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని భోగట్టా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న తారక్ కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీలవుతారని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్సినిమా కోసం కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సైతం భాగస్వామిగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ పేరును పరిశీలిస్తున్నారు.




 


మరింత సమాచారం తెలుసుకోండి: