అయితే క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఎన్నో విధాలుగా కలిసిరాగా గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం భిన్నంగా జరిగిందనే చెప్పాలి. గేమ్ ఛేంజర్ ను క్లీంకార సెంటిమెంట్ సైతం అస్సలు కాపాడలేదుగా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా ఫుల్ రన్ లో 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఈ మూవీ వల్ల దిల్ రాజుకు ఏకంగా 125 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక భారీ బడ్జెట్ సినిమాకు ఈ స్థాయిలో నష్టాలు రావడం సాధారణ విషయం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజైనా నెగిటివ్ టాక్ వల్ల ఈ సినిమాకు థియేటర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.
గేమ్ ఛేంజర్ డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం కాగా ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేసిందని భోగట్టా. ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. శంకర్ కెరీర్ కు మాత్రం ఈ సినిమా చేసిన డ్యామేజ్ అంతాఇంతా కాదు.