యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఐదు కంటే ఎక్కువ భాషల్లో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
 
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను కేవలం 270 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమా హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలకు మంచి లాభాలను అందించిన సంగతి తెలిసిందే. సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
సినిమా కథను నీల్ చాలా సంవత్సరాల క్రితమే సిద్ధం చేశారని అయితే బడ్జెట్ సమస్య వల్ల ఇంతకాలం వెయిట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఆ సమస్యను అధిగమించి ఎన్టీఆర్ తో భారీ సినిమాను ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్ లకు ఓటు వేస్తూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఅర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమాతో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలని భావిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. వేగంగా షూటింగ్ ను స్టార్ట్ చేస్తే ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: