సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆఫర్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో ఎవరు చెప్పలేరు. ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలనే సంగతి తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా రాకపోయినా ఇండస్ట్రీకి మాత్రం దూరం కానంటూ భూమి ఫడ్నేకర్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో భూమి సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
 
అయితే హాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం అవకాశాలను సొంతం చేసుకుని మన దేశ సంస్కృతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని తాను ఫీలవుతున్నానని భూమి ఫడ్నేకర్ చెప్పుకొచ్చారు. సమాజానికి సందేశాన్ని ఇచ్చే పాత్రలలో ఎక్కువగా ఈ నటి నటించడం జరిగింది. గతేడాది భక్షక్ సినిమాలో వైశాలి సింగ్ పాత్రలో అద్భుతంగా నటించి భూమి ఫడ్నేకర్ తన నటనతో ఆకట్టుకోవడం జరిగింది.
 
ఆఫ్ స్క్రీన్ లో సైతం వాతావరణంలో మార్పులు తీసుకురావడం కోసం కృషి చేయడంపై నాకు ఆసక్తి ఎక్కువని భూమి ఫడ్నేకర్ అన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి సమాజంతో పాటు కలుషితం లేని వాతావరణాన్ని అందించాలని తాను భావిస్తానని ఆమె పేర్కొన్నారు. మూవీ ఆఫర్లు వచ్చినా రాకపోయినా ఇండస్ట్రీని మాత్రం అస్సలు వదిలిపెట్టనని భూమి ఫడ్నేకర్ తెలిపారు.
 
మన దేశ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లానని భూమి ఫడ్నేకర్ వెల్లడించారు. కళకు భాషకు సరిహద్దులు లేవని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం కృత్తిమ మేధ హవా నడుస్తోందని ఏఐ వల్ల సినిమాల్లో కొత్త ప్రపంచాలను సృష్టించబోతున్నారని భూమి ఫడ్నేకర్ తెలిపారు.  మీడియా సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ లాంటిదని భూమి వెల్లడించారు. భూమి ఫడ్నేకర్ తెలుగులో కూడా బిజీ కావాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. భూమి ఫడ్నేకర్ వయస్సు ప్రస్తుతం 35 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. భూమి ఫడ్నేకర్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: