సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా విడుదలై మంచి విజయాలను అందుకుంది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వచ్చిన ఈ ఫ్యామిలీ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నది. డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ సినిమా పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిల్ దాఖలైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కలెక్షన్ విషయంలో క్విడ్ ప్రోకి పాల్పడ్డారంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో చైల్డ్ యాక్టర్ కామెడీతో అద్భుతంగా ఆకట్టుకుంది.


ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి అంటూ చెప్పడమే కాకుండా అలాగే ఐటి,ఈడి, జీఎస్టీ తో సైతం విచారణ జరిపించాలి అంటూ  పిల్ లో పేర్కొన్నారట. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై 9 రోజులకు పైగా అయిన 230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలియజేశారు. మొదటిరోజు ఈ సినిమా 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ చేసి వెంకటేష్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచినది.


మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ అయినా ఈ కేసు పై అటు దిల్ రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా ఎన్నో వివాదాలను సైతం చుట్టూ పడుతున్నది.. ఇప్పటికీ ఇంకా దిల్ రాజు ఇంట ఐటీ సోదరులు కూడా కొనసాగుతూ ఉన్నాయి.. అలాగే ఆయన కార్యక్రమాలలో సోదాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే హైకోర్టులో ఈ చిత్ర బృందానికి సంబంధించి ఆదాయం పైన పిల్ దాఖలు కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: