టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. బాలయ్య హీరోగా సింహా అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే సింహా అనే టైటిల్ తో తెరకెక్కినా బాలయ్య అభిమానులను మెప్పించని సినిమా ఏదనే ప్రశ్నకు సీమ సింహం సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది. 2002 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.
 
రాంప్రసాద్ డైరెక్షన్ లో చిన్నికృష్ణ కథతో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది. అయితే ఈ సినిమాలో సాయికుమార్ కూడా కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు. బాలయ్య సోదరుడిగా ఈ సినిమాలో సాయికుమార్ నటించారు. ఈ పాత్రకు సంబంధించిన ట్విస్టులు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
 
ఒక సన్నివేశంలో బాలయ్య, సాయికుమార్ హోరాహోరీగా తలపడతారు. ఆ సీన్ లో భాగంగా సాయికుమార్ బాలయ్య గుండెలపై తన్నాల్సి ఉండగా ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ డూప్ తో ఆ సీన్ ను పూర్తి చేయాలని భావించారు. అయితే బాలయ్య మాత్రం తనకు డూప్ వద్దని తేల్చి చెప్పడంతో డూప్ లేకుండానే ఆ సీన్ ను పూర్తి చేయడం జరిగింది. సీమ సింహం సినిమా ఆశించిన టాక్ సొంతం చేసుకోకపోయినా కమర్షియల్ గా బాగానే కలెక్షన్లను సాధించింది.
 
బాలయ్య డూప్ లేకుండా ఫైట్ సీన్లలో నటించడం ద్వారా ప్రశంసలు అందుకుంటూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. బాలయ్య త్వరలో అఖండ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారు. బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అవుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ బాలయ్యకు విజయాన్ని అందిస్తాయేమో చూడాలి. సాయికుమార్ ఒక సందర్భంలో ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.


 


మరింత సమాచారం తెలుసుకోండి: