అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ ఏడాది సంక్రాంతి కి వచ్చి బాక్సాఫీస్ షేక్ చేసింది.ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్ అయినటువంటి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ వంటి సినిమాలను కూడా పక్కకు నెట్టింది. గేమ్ చేంజర్ అయితే డిజాస్టర్.. డాకు మహారాజ్ సినిమా హిట్ అయింది. కానీ ఈ రెండు సినిమాల కంటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి విజేతగా వెంకటేష్ నిలిచారని చెప్పుకోవచ్చు. అయితే ఇది చూస్తుంటే 2019 సంక్రాంతి రిజల్ట్ రిపీట్ అయింది అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే 2019లో సంక్రాంతి బరిలో వినయ విధేయ రామతో రామ్ చరణ్, బాలకృష్ణ కథానాయకుడితో వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబోలో ఎఫ్2 సినిమా వచ్చింది. అయితే ఆ ఏడాది బాలకృష్ణ,రామ్ చరణ్ ఇద్దరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.కానీ వెంకీ వరుణ్ కాంబోలో వచ్చిన ఎఫ్2 మాత్రం భారీ హిట్ కొట్టింది. 

ఈ విషయం పక్కన పెడితే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రెడిట్ మొత్తం మహేష్ బాబుదే అంటూ సంచలనం కామెంట్లు చేశారు అనిల్ రవిపూడి. అయితే సినిమా హిట్ అయితే డైరెక్టర్ కో లేక హీరో హీరోయిన్ కో నిర్మాతలకో క్రెడిట్ ఇస్తారు. కానీ ఇలా సినిమాతో ఎలాంటి సంబంధం లేని మహేష్ బాబు కి ఎందుకు క్రెడిట్ ఇచ్చారు అని చాలామంది భావిస్తున్నారు. అయితే సినిమా క్రెడిట్ మహేష్ బాబుకి ఇవ్వడానికి కారణం మహేష్ బాబు వల్లే ఈ సినిమా తెరకెక్కినట్టు అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అనిల్ రావిపూడి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా కథకు తొలి అడుగు పడింది మహేష్ బాబు తోనే.నా మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన రావడానికి విత్తనం వేసింది మహేష్ బాబే. ఎందుకంటే ఆయన జైలర్ సినిమా చూశాక మీరు కూడా ఇలా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ట్రై చేయండి.మీరు కచ్చితంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తారు.

 అలాగే ఇండస్ట్రీలో ఆ పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ మీరు అని చెప్పారు.ఇక మహేష్ బాబు మాటలతో నా మైండ్లోకి ఈ ఆలోచన వచ్చింది. అలాగే భగవంత్ కేసరి సినిమా చూశాక మీరు కామెడీ జానర్ లో సినిమా తీస్తే హిట్టు కొడతారని చెప్పారు.అంతేకాకుండా మహేష్ బాబు నాతో 45 నిమిషాల పాటు సినిమా గురించి చర్చించారు. ఆ తర్వాత మహేష్ బాబు థాట్ ఇవ్వడం వల్లే నా మైండ్ లోకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చింది. అలా ఆయన మాటల కారణంగానే నేను ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాని తెరకెక్కించాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అనిల్ రావిపూడి. ఇక ఈ మాటలు విన్న మహేష్ బాబు ఫ్యాన్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ క్రెడిట్ మొత్తం మహేష్ బాబుకే అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: