ఏంటి సమంతని చెడగొట్టింది రూమర్డ్ లవర్ గా పేరున్న రాజ్ నిడిమోరునేనా.. ఎందుకు సమంత అలా మాట్లాడింది..రాజ్ వల్లే తను చెడిపోయింది అనడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. దర్శకద్వయం అయినటువంటి రాజ్ అండ్ డీకే లతో సమంత వరుస వెబ్ సిరీస్ లు చేస్తుంది. అలా ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ తో మొదలైన వీరి ప్రయాణం సిటాడల్ లో కూడా కొనసాగింది. ఆ తర్వాత డైరెక్టర్ రాజ్ సమంత తీస్తున్న రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ కి నిర్మాతగా కూడా మారారు. అలా వరుస వెబ్ సిరీస్ లు డైరెక్టర్ రాజ్ తో చేయడంతో సమంతకి రాజ్ కి మధ్య ఎఫైర్ ఉందని, వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలు వినిపించాయి. అంతేకాదు సమంత లాగే రాజ్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి సమంత రాజ్ ఇద్దరు రెండో పెళ్లి చేసుకుంటారు అని కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్గా ఓ జాతీయ మీడియా కూడా సమంత రాజ్ ల మధ్య నిజంగానే ఎఫైర్ ఉంది అంటూ రాసుకోచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సమంత మాట్లాడుతూ.. నన్ను చెడగొట్టింది రాజ్ అండ్ డీకే..ఆ ఇద్దరు డైరెక్టర్ ల వల్లే నేను చెడిపోయాను. అయితే ఇది కూడా నా మంచికే.ఎందుకంటే చాలామంది మీరు ఎందుకు సినిమాలు తగ్గించేశారు. మళ్లీ సినిమాల్లో ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు. అయితే కచ్చితంగా నేను సినిమాలు చేస్తాను. కానీ నాకు ఆ కథ 100% నచ్చితేనే చేస్తాను. ఒకవేళ నాకు కథ నచ్చకపోతే నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేను.అందుకే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాను. ఇక ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్ లో చేసే సమయంలో ఇప్పటివరకు చేయనిది ఏదైనా చేసి నిరూపించుకోవాలి అనుకున్నాను. అలాగే సిటాడెల్ సమయంలో కూడా అలాగే అనుకున్నాను. అయితే నేను ఇలాంటి పాత్రలు ఇంతకుముందు ఎప్పుడూ కూడా చేయలేదు.

కానీ ఆ పాత్రలు చాలా ఛాలెంజింగ్ గా ఉన్నాయి.ఇక త్వరలో రాబోతున్న రక్త్ బ్రాహ్మండ్ వెబ్ సిరీస్ లో కూడా నా పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉంది. ఇక ఈ విషయంలో డైరెక్టర్ రాజ్ డీకే నన్ను పూర్తిగా చెడగొట్టేశారు. వాళ్ళ వల్లే నేను నా పాత్రలని ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాను. ఇది కూడా నా మంచికే.పాత్రలు ఏవైనా సరే చాలెంజింగ్ గా ఉండేవి తీసుకోవాలనే  విధంగా నన్ను వాళ్ళు చెడగొట్టారు. అందుకే నేను సినిమాలు ఎంపిక చేసే సమయంలో ఛాలెంజింగ్ గా ఉండే పాత్రలను ఎంచుకుంటున్నాను. ఇక ఇలా ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకునేలా నన్ను తయారు చేసింది కూడా ఈ ఇద్దరు డైరెక్టర్లే అంటూ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓవైపు డైరెక్టర్ రాజ్ తో ఆమెకు ఎఫైర్ వార్తలు వినిపిస్తున్న వేళ మరోవైపు సమంత అదే డైరెక్టర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందరిలో మరింత అనుమానాన్ని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: