మరీ ముఖ్యంగా గర్ల్స్ ఫ్రెండ్ లిస్టులో ముగ్గురు నలుగురు మాత్రమే అమ్మాయిలు ఉంటారు. వాళ్ళల్లో ఒకరే అనుష్క . ప్రభాస్ - అనుష్కల మధ్య ఏదో ఉంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తుంది . వాళ్లు మా మధ్య అలాంటిది ఏదీ లేదు అని నెత్తి నోరు మొత్తుకుంటున్న కూడా జనాలు నమ్మడం లేదు . ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడం .. అదేవిధంగా అనుష్క కూడా పెళ్లి చేసుకోకపోవడం.. ఇందుకు ప్రధాన కారణంగా మారిపోయింది. అంతేకాదు అడప దడప వీళ్ళు కలిసి దిగిన ఫొటోస్ వీళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా అందుకు ఆజ్యం పోసింది .
అయితే ప్రభాస్ బర్త్డ డేకి చాలామంది రకరకాల గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు . కానీ ప్రభాస్ బర్తడే కి ఆయనకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ మాత్రం అనుష్కనే. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ . కాగా ప్రభాస్ మంచి ఫుడీ. బిర్యాని కనిపిస్తే లాగించేసే టైప్. అలాంటి ప్రభాస్ కి మంచి గిఫ్ట్ అంటే ఆ ఫుడే. ఆ కారణంగానే అనుష్క - ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓ రోజు "బిల్లా" సినిమా షూటింగ్ టైంలో అందరికీ అన్నం తెప్పించే ప్రభాస్ కే స్పెషల్ గా తన చేతితో వండి మరి బిర్యానీ తెచ్చి షాక్ ఇచ్చిందట . అదే బర్త్డ డే గిఫ్ట్ అంటూ సర్ ప్రైజ్ చేసిందట . అప్పట్లో ఈ వార్త బాగా ట్రెండ్ అయింది . ఇలా ప్రభాస్ కి ఇష్టమైన పనులు చేస్తుంది అనుష్క అన్న కారణంగా కూడా వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు జనాలు. ఏమో అలా ఉంటే పెళ్లి చేసుకోవచ్చుగా అనే జనాలు కూడా లేకపోనూ లేరు..!