తెలుగు సినిమాలకు కొన్ని సంవత్సరాల క్రితం 100 కోట్ల కలెక్షన్లు వస్తే జనాలు దానిని పెద్ద నెంబర్ గా చూసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మన తెలుగు స్టార్ హీరోలు నటించిన సినిమాలకు విడుదల అయిన మొదటి రోజే వందల కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి. సినిమా బాగుంటే వేల కోట్ల కలెక్షన్లను ఈజీగా రాబడుతున్నాయి. దానితో హీరోల రెమ్యూనరేషన్ పెరిగింది. అలాగే దర్శకులు , ఇతర టెక్నీషియన్స్ కూడా తమ రేట్లు భారీగా పెంచడం , అలాగే మూవీలను భారీగా తరకెక్కించడం కోసం డబ్బులను భారీగా ఖర్చు పెడుతున్నారు.

దానితో సినిమా వ్యాయం కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ఇకపోతే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీస్ , ఆర్ ఆర్ ఆర్ సినిమాలు ఏ రేంజ్ ఇంపాక్ట్ ను ప్రపంచ వ్యాప్తంగా సృష్టించాయో మనందరికీ తెలిసిందే. దానితో రాజమౌళి , మహేష్ తో చేయబోయే సినిమా స్టార్ట్ కాకముందే ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను కే ఎల్ నారాయణ నిర్వహించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం ఏకంగా 1000 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడానికి నిర్మాత ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అలా రాజమౌళి , మహేష్ తో 1000 కోట్ల బడ్జెట్ తో మూవీ ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. మరి వెయ్యి కోట్ల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు అని , ఈ సినిమా కనుక బారి కలెక్షన్లను వసూలు చేయకపోతే నిర్మాతకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: