చూస్తూ ఉంటే జనాలలో ఇంకా పుష్ప ఫీవర్ తగ్గినట్లే లేదు . పుష్ప సినిమాని ఏ స్థాయిలో సుకుమార్ తెరకెక్కించాడో అందరికీ తెలిసిందే . ఆఫ్ కోర్స్ పుష్ప 1 సినిమా కొందరి లైఫ్ లో ఆనందం నింపితే కొందరు లైఫ్ లో విషాదం నింపింది . కాగా బన్నీకి ఈక్వల్ బ్యాలెన్స్ పోర్షన్ లో ఎమోషన్స్ ఇచ్చింది ఈ పుష్ప 2 సినిమా.  పుష్ప2  ది రూల్ అంటూ డిసెంబర్ ఐదవ తేదీ విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది . ఎలాంటి కలెక్షన్స్ సాధించిందో అందరికీ తెలిసిందే . అయితే పుష్ప 1 పుష్ప 2 గురించి మాట్లాడుకునే జనాలు పుష్ప3  సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా..? అని పుష్ప3  కథ ఎలా ఉండబోతుంది అని .. అసలు పుష్ప3 లో నటీనటులు ఎవరు ఉండబోతున్నారు అని పుష్ప2 కంక్లూషన్ ఆధారంగా మాట్లాడుకుంటున్నారు.


ఇదే క్రమంలో రీసెంట్గా దేవిశ్రీప్రసాద్ సైతం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . పుష్ప1 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది సమంత.. పుష్ప2 సినిమాలో శ్రీ లీల ఐటెం సాంగ్ లో కనిపించింది . ఊ అంటావా మావ అంటూ సమంత..దెబ్బలు పడతాయి రాజా అంటూ శ్రీలీల  షేక్ చేసి పడేసారు. ఇప్పుడు పుష్ప3 సినిమాలో ఏ హీరోయిన్ చేత ఐటమ్ సాంగ్ చేయిస్తే బాగుంటుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే దానిపై రీసెంట్ గానే రియాక్ట్ అయ్యాడు దేవి శ్రీ ప్రసాద్ . దీంతో ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.



పుష్ప3 సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం జాన్వి కపూర్ అయితే బాగుంటుంది అంటూ పరోక్షంగా స్పందించారు . దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జనాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు . సుకుమార్ పుష్ప3 సినిమాలో జాన్విని స్పెషల్ సాంగ్ లో చిందులే ఇస్తే బాగుంటుంది అంటున్నారు . అయితే బోనీ కపూర్ అందుకు ఒప్పుకుంటాడా..? లేదా..? అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అవుతున్న మూమెంట్లో స్పెషల్ సాంగ్ అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే . అయితే సుకుమార్  డైరెక్షన్ అయితే కళ్ళు మూసి ఒకే చేసేయచ్చు అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: