తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ తాజాగా విడముయార్చి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను సంక్రాంతి పండక్కు విడుదల చేయలేదు. ఇకపోతే ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు.

తమిళ్ లో ఈ సినిమాను విడముయార్చి టైటిల్ తో విడుదల చేయనుండగా ... తెలుగులో మాత్రం ఈ మూవీ ని పట్టుదల అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కులను ఏ సంస్థలకు అమ్మి వేశారు అనే విషయాలను అధికారికంగా ప్రకటించారు.

సినిమా యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ థియేటర్ హక్కులను ఏసియన్ , సురేష్ సంస్థలకు అమ్మివేసినట్లు , సీడెడ్ ఏరియా హక్కులను శ్రీలక్ష్మి మూవీ సంస్థకు అమ్మి వేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ రెండు సంస్థల వారు కూడా ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: