బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది.. కానీ పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది . తెలుగులో "దేవర" అనే సినిమా ద్వారా డెబ్యూ ఇచ్చింది . ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వనప్పటికీ ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి . అయితే జాన్వి కపూర్ తెలుగులో దేవరకంటే ముందే మరోక సినిమాలో నటించాల్సి ఉండింది. చాలా సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ ఒక సినిమాకి సైన్ చేసి లాస్ట్ మినిట్ లో సడన్గా సినిమా నుంచి తప్పుకుంది . ఆ సినిమా మరేదో కాదు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్".
అక్కినేని అఖిల్ కెరియర్ లో నిలిచిన వన్ అండ్ ఓన్లీ మూవీ గా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది . ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా జాన్వీ కపూర్ ని అనుకున్నారట మేకర్స్. అయితే అప్పటివరకు అక్కినేని అఖిల్ కి హిట్ లేకపోవడంతో బోనికపూర్ ఆలోచించారట . ఒకవేళ అఖిల్ సినిమా ఫ్లాప్ అయితే జాన్వి కపూర్ కి అది నెగిటివ్గా మారుతుంది అంటూ అభిప్రాయపడి .. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట. అయితే ఈ సినిమా బాగా హిట్ అయింది . కానీ అఖిల్ కన్నా కూడా పూజ హెగ్డే ఈ సినిమా హిట్ సక్సెస్ బాగా దక్కించుకుంది. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ ఇదే వార్త బాగా వైరల్ గా మారింది..!