సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సందర్భాలలో ఒకే రోజు భారీ ఎత్తున సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలా ఈ సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన ఏకంగా నాలుగు సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.
జాక్ : సిద్దు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేయనున్నారు. వరస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సిద్దు నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ : తమిళ నటుడు అజిత్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాపై తమిళ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు.
జాట్ : బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 10 వ తేదీన తెలుగు , హిందీ , తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు , హిందీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.
ఇడ్లీ కడాయి : ధనుష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు.
ఇలా ఈ నాలుగు సినిమాలు ఏప్రిల్ 10 వ తేదీన విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి.