ఇండస్ట్రీలో జక్కన్నకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మరీ ముఖ్యంగా జక్కన్నతో సినిమా అంటే బడా బడా స్టార్ హీరోస్ కూడా రెడీగా ఉంటారు . అయితే జక్కన్న లో ఉన్న మెయిన్ ప్రాబ్లం కాల్ షిట్స్ చాక్లెట్ కన్నా ఎక్కువగా తినేస్తాడు . జక్కన్న సినిమాకి  కమిట్ అయ్యి రెండేళ్లు కాల్ షీట్స్ అడిగితే ..అది నాలుగేళ్ల కిందకి టర్న్ చేసుకుంటాడు . అదేవిధంగా జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . అఫ్కోర్స్ ఆయనతో వర్క్ చేసిన హీరోలు ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేస్తూ ఉంటారు .


రామ్ చరణ్ - ఎన్టీఆర్ - ప్రభాస్ ఇలా ఎంతోమంది హీరోస్ ఆ విషయాన్ని అఫీషియల్ గా కూడా చెప్పారు . అయితే ఇప్పుడు మహేష్ బాబుతో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి . ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్ గానే హైదరాబాద్ కి వచ్చి ఆమె పలు టెంపుల్స్ లో ప్రత్యేక పూజలు కూడా చేశారు.  దీనికి సంబంధించిన పిక్చర్స్ బాగా వైరల్ అవుతున్నాయి . అయితే ఈ మూమెంట్ లోనే ఇప్పుడు మహేష్ బాబు ని అదే విధంగా ప్రియాంక చోప్రాన్ని చూసి ఫన్నీగా నవ్వుకుంటున్నారు రాంచరణ్ - ప్రభాస్ -తారక్ అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.



ప్రియాంక చోప్రా చాలా చాలా బిజీ షెడ్యూల్ కల హీరోయిన్ . బాలీవుడ్ - హాలీవుడ్ ని షేక్ చేసేస్తుంది . గ్లోబల్ బ్యూటీనే  అలాంటి ప్రియాంక చోప్రాన్ని ఏకంగా సంవత్సరం పాటు కాల్ షీట్స్ అడిగాడట జక్కన్న . దీంతో అందరూ షాక్ అయిపోతున్నారు.  ఒక హీరోయిన్ కి సంవత్సరం పాటు కాల్ షీట్స్ అంటే ఇక హీరో కాల్ షీట్స్ ఎన్ని తీసుకొని ఉంటారు. అంతేకాదు ప్రియాంక చోప్రా - రాజమౌళికి వన్ ఇయర్ కాల్ షీట్స్ అంటే టూ ఇయర్స్ ఇచ్చేసినట్లే అనుకోవాలి . ప్రియాంక చోప్రా మిగతా ప్రాజెక్ట్ పరిస్థితి ఏమైపోవాలో .. ఇలా అడ్డంగా ఇరుక్కుపోయింది ఏంటి ..? ప్రియాంక అంటూ నవ్వుకుంటున్నారు జనాలు.  అంతేకాదు మహేష్ బాబును చూసి కూడా అదే విధంగా నవ్వుకుంటున్నారు. ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు మహేష్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: