ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ని వాడకూడదని వాటి మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోకూడదని చాలామంది అధికారులు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ట్రావెలింగ్ ఇన్ఫ్లూయర్ అయినా భయ్యా సన్నీ యాదవ్ కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ వీడియోని షేర్ చేస్తూ మరొకసారి బెట్టింగ్ యాప్స్ సంబంధించిన సూచనలను కూడా తెలియజేశారు. అయితే ఈ వీడియోని ఉద్దేశిస్తూ బీసీ సజ్జనర్ ఐపీఎస్ అధికారి ఇలాంటి వారిని నమ్మవద్దంటూ హెచ్చరించడం జరిగింది.
ఇలా తన ట్విట్టర్లో రాసుకొస్తూ.."చూశారా వస్తువులు కొనడం ఎంత సులువు అలాగే షాపుకు వెళ్లి అక్కడే కూడా బెట్టింగ్ పెట్టి మరి వచ్చిన లాభంతో ఈ వస్తువుని కొన్నట్టుగా చూపించడం జరిగింది అంటూ ఫైర్ అయ్యారు.. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏదైనా ఉంటుందా అంటూ ఆయన ఫైర్ కావడం జరిగింది.ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేది కూడా చాలామంది ప్రాణాలను తీస్తూ ఉంటే తనకేం పట్టనట్టుగా ఉంటూ స్వలాభం కోసమే ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లు ఇయర్స్ చిత్రవిచిత్రమైన వేషాలను వేస్తూ ఉన్నారంటూ తెలిపారు. తమకు ఫాలో అవర్స్ ఉన్నారు ప్రమోషన్స్ పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తాము అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటూ సన్నీ యాదవ్ పైన ఫైర్ అయ్యారు". ఇలాంటి మాయగాల్లో వదిలే వీడియోలని నమ్మి మోసపోకండి ప్రజలు అంటూ తెలిపారు.