సినిమా ఇండస్ట్రీలో అందం , నటన , విజయాలు మూడు ఉన్నట్లయితే వరుస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారే చాలా తక్కువ సమయంలో అద్భుతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు. కానీ కొంత మంది విషయంలో మాత్రం ఇలా జరగదు. నతించిన సినిమాలు మంచి విజయాలను అందుకున్న వారు సినిమాల్లో తమ అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త వెనుకబడిపోతూ ఉంటారు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ రేబా మౌనిక జాన్ ఒకరు.

బ్యూటీ శ్రీ విష్ణు హీరో గా రూపొందిన సామజవరగమన అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ నటి తెలుగు లో నటించిన మొదటి సినిమానే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈ మూవీ తర్వాత పెట్టి తెలుగులో క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమెకు సామజవరగమన సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో ఈ నటి స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటికే ఈ బ్యూటీ నటించిన ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ యొక్క లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇలా ఈమెకు విజయాలు , అందం , నటన అన్ని ఉన్నా కూడా క్రేజీ సినిమాల్లో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ఈమెకు మంచి సినిమాల్లో అవకాశాలు దక్కితే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: