టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న కాంబినేషన్లో బాలయ్య , బోయపాటి కాంబో ఒకటి. వీరి కాంబినేషన్లో మొదటగా సింహ అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరి కంబోలో వచ్చిన లెజెండ్ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక చివరగా వీరి కాంబినేషన్లో అఖండ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ హీరోగా బోయపాటి ప్రస్తుతం అఖండ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే సినిమాను రూపొందిస్తున్నాడు.

ఇప్పటికే అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో అఖండ 2 పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే అఖండ సినిమాలో బాలయ్య కు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఈ మూవీ కంటే ముందు ఈమెకు బ్లాక్ బస్టర్ సినిమానే లేదు. కానీ ఈ సినిమాతో ఈమెకు బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఆ తర్వాత కూడా ఈమె కెరియర్ అద్భుతమైన స్థాయిలో ముందుకు సాగుతుంది. అఖండ 2 సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో సంయుక్త మీనన్ కూడా కనిపించబోతున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ , సంయుక్త మీనన్ ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ , సంయుక్త మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీ.లో లక్కీ బ్యూటీలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. అలా ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ఇద్దరిని అఖండ 2 లో బాలకృష్ణ సరసన బోయపాటి చూపించబోతున్నాడు అని , ఈ మూవీ బ్లాక్ బస్టర్ కచ్చితంగా అందుకుంటుంది అని బాలయ్య అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: