టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన నటించిన సినిమాలకు హిట్ , ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇక ఈయన నటించిన సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చిన భారీ కలెక్షన్లు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. అలా పవర్ నటించిన సినిమాలలో ఫ్లాప్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

అజ్ఞాతవాసి : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ , అను ఇమ్మానుయల్ హీరోయిన్లుగా నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఫ్లాప్ తక్ వచ్చింది. దానితో బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అయిన కూడా ఈ సినిమా 95 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి పవన్ కళ్యాణ్ స్టామినాను బాక్సాఫీస్ దగ్గర నిరూపించింది.

సర్దార్ గబ్బర్ సింగ్ : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయినా కూడా ఈ సినిమా 92 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

కాటమ రాయుడు : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: