బుల్లితెర నటి చవీ మిట్టల్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈమె హిందీ టెలివిజన్‌లో పనిచేసే భారతీయ నటి. తుమ్హారీ దిశలో దిశా, బాందినిలో సుభద్ర, ఏక్ చుట్కీ ఆస్మాన్‌లో హిమాంగి, కృష్ణదాసిలో తులసి పాత్రలలో ఈమె సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. మిట్టల్ తన భర్తతో కలిసి డిజిటల్ ప్రొడక్షన్ కంపెనీ అయిన సూపర్బ్ ఐడియాస్ ట్రెండింగ్ ని కూడా స్థాపించింది. ఈమెది ప్రేమ వివాహం. ఈమెకి అరీజా అనే కుమార్తె అర్హమ్ అనే కుమారుడు ఉన్నారు.
ఇక మిట్టల్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. 'క్యాన్సర్ చికిత్స కారణంగా జుట్టు కోల్పోతున్న నాపై విమర్శలు చేస్తున్నారు. మనుషులలో మానవత్వంలో చనిపోయింది. నేను చాలా కాలంగా రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతున్నాను. ఈ రోగం వల్ల నేను చాలా బాధలు అనుభవిస్తున్నాను. ఈ క్యాన్సర్ తో నేను పదేళ్ల పాటు ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాన్సర్ వల్ల చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్‌, బరువు సరిగా లేకపోవడం, మూడ్‌ స్వింగ్స్‌, తిమ్మిర్లు  వంటివి చాలా ఉంటాయి. నన్ను ఇష్టపడి కొందరు నా అకౌంట్ ని ఫాలో అయితే మరికొందరు ఏమో నన్ను ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారు. నా పరిస్తితిని అర్దం చేసుకోకుండా నన్ను ట్రోల్ చేస్తున్నారు. ముందు అమ్మతనాన్ని నిలుపుకోవడం కోసం నేను పోరాడను. ఇప్పుడేమో జుట్టు కోసం పోరాడుతున్నాను. జుట్టు అంటే అమ్మాయిలకి అమితమైన ప్రేమ ఉంటుంది. ఇలాంటి కష్టతర సమయంలో మీరు చేసే కామెంట్లు నన్ను మరింత బాధకు గురిచేస్తున్నాయి. ఒక క్యాన్సర్‌ వారియర్‌ను ట్రోల్‌ చేయడానికి మీకు మనసెలా అంగీకరించిందో అర్థం కావట్లేదు' అంటూ మిట్టల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆతర్వాత ఆమె మీకు తలనిండా వెంట్రుకలు, క్యాన్సర్‌ మరియు నీచమైన విమర్శలు లేని జీవితం ఉండాలని తాను ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: