టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి హీరోలుగా చిత్రపరిశ్రమకు పరిచయమై వారి నటనతో ఫేమస్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరో విశ్వక్సేన్ ఒకరు. విశ్వక్సేన్ 2017లో వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిశ్రమయ్యారు. ఆ సినిమాలో తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విశ్వక్సేన్ ఆ సినిమా అనంతరం వరస పెట్టి సినిమాలు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.


ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన అభిమానుల ముందుకు వస్తూనే ఉంటాడు. తనదైన నటన, స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం "లైలా". ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. రామ్ నారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రయోగాత్మక సినిమాలకు విశ్వక్సేన్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటారు. ఇక లైలా సినిమాలో విశ్వక్సేన్ మొదటిసారిగా లేడీ గెటప్ లో కనిపించబోతున్నారు.



ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టుర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల కాగా ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తుంది. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కాగా, ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను శర వేగంగా నిర్వహిస్తున్నారు.


అందులో భాగంగా తాజాగా విశ్వక్సేన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... లైలా సినిమాలో నేను ప్రొఫెషనల్ బ్యూటీషియన్ గా కనిపిస్తానంటూ విశ్వక్సేన్ వెల్లడించారు. తన జీవితంలో లైలా పాత్ర మెమోరబుల్ గా గుర్తుండి పోతుందని పేర్కొన్నారు. ముంబైలో ఫిల్మ్ స్కూళ్లలో ఉన్న సమయంలో కుంతీ రోల్ చేశానని విశ్వక్సేన్ గుర్తు చేసుకున్నాడు. భవిష్యత్తులో ఎన్ని రోల్స్ చేసినా కూడా లైలా పాత్ర మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుందని విశ్వక్సేన్ అన్నారు. ఆ గెటప్ లో తన నాన్నకి ఫోన్ చేసి మాట్లాడితే గుర్తుపట్టలేదని విశ్వక్సేన్ తెలిపారు. కాగా, ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: