మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించాడు. చిరంజీవి గారితో తదుపరి సినిమా చేయబోతున్నాను. కానీ అన్ని ఓకే అయ్యాక అధికారిక ప్రకటన వస్తుంది అని ఆయన పలు మార్లు చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించబోతున్నాడు. ఇకపోతే తాజాగా ఈ బ్యానర్ వారు లైలా అనే సినిమాను రూపొందించారు. విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం పాత్రికేయులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి సాహూ గారపాటి చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబోలో సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సాహు గారపాటి మాట్లాడుతూ ... మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మా బ్యానర్ లో ఓ సినిమా రూపొందబోతుంది. ఆ సినిమా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతుంది. అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. చిరంజీవి గారి సినిమాతో మరో విజయాన్ని ఆయన అందుకోబోతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయబోతున్నాం.

చిరంజీవి గారి సినిమాతో అద్భుతమైన విజయం కొట్టడానికి రెడీగా ఉన్నాం అని సాహు గారపాటి చెప్పుకొచ్చాడు. తాజా వ్యాఖ్యలతో చిరంజీవి , అనిల్ రావిపూడి సినిమాపై సాహు గారపాటి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు అర్థం అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా ... తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: