సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శోభిత వివాహమైన తర్వాత చాలా రోజుల వరకు మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ శోభిత సోషల్ మీడియాలో యాక్టివ్గా అయ్యి మోడలింగ్లో కొత్తగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీకి వెళ్లిన శోభిత ఢిల్లీలో ఉన్నప్పుడు అంటూ ఒక సెల్ఫీ ఫోటోని షేర్ చేయడం జరిగింది. అయితే ఈ ఫోటోలు మోడరన్ దుస్తులలో ఉండడమే కాకుండా శోభిత ఈ ఫోటోలలో గ్లామర్ తో అందాలతో మరింత అందరి దృష్టిని ఆకర్షించేలా కనిపిస్తోంది.
అసలు శోభిత ఢిల్లీకి ఎందుకు వెళ్ళింది అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. శోభిత స్కిన్ టైట్ దుస్తులతో తన ఎద అందాలను హైలెట్ చేస్తూ టాప్ టు బాటమ్ సెల్ఫీతో హైలెట్గా నిలుస్తోంది. షూటింగ్ నిమిత్తమే శోభిత అక్కడికి వెళ్ళింది అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య తో వివాహం తర్వాత సినిమాలకు దూరం అవుతుందని చాలామంది అనుకున్నప్పటికీ కానీ నటనను కొనసాగిస్తానని ఎన్నోసార్లు వెల్లడించింది. అలా అన్నట్టుగానే పెళ్లి అయిన కొన్ని వారాలకి ఇప్పుడు సినిమా షూటింగ్లో బిజీ కాబోతోంది. శోభిత భర్త నాగచైతన్య నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతున్నది. మరి ఈ సినిమాతో నాగచైతన్య కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి.