అందులో సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. మొదటి నుండి ఇప్పటివరకు ఈ షోలో టాప్ జోడీగా అమర్ దీప్- తేజస్విని కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా.. తెలుగు టీవీ షోలకు సంబంధించి తాజాగా 52వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. స్టార్ మా ఛానెల్ లో అటు సీరియల్స్ లో, ఇటు షోలలో ఇతర తెలుగు ఛానెల్స్ కు అందనంత ఎత్తులో ఉంటోంది. టీఆర్పీ రేటింగ్స్ లో ఆ ఛానెల్లో వచ్చే సీరియల్స్, షోలన్నీ తిరుగులేని రేటింగ్స్ తో దూసుకెళ్తున్నాయి. అయితే స్టార్ మాలో బిగ్ బాస్ ప్లేస్ లో వచ్చిన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడే టాప్ లో నిలవడం విశేషం. టాప్ 5లో ఇస్మార్ట్ జోడీ షో టాప్ 1 లో నిలిచి ప్రేక్షకుల మనసు మరోసారి గెలుచుకుంది.