టాలీవుడ్ లో రెండున్నర దశాబ్దాల క్రితం ఎంతోమంది హీరోయిన్లు వచ్చి హాట్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేశారు. మరి ముఖ్యంగా దివంగత దివ్యభారతి - మమతా కులకర్ణి - రంభ - రాశి - వాణి విశ్వనాథ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్లు తమ హాట్ హాట్ ఫోటోలు హాట్ హాట్ సీన్లతో అప్పట్లో కుర్ర కారుకు మంచి కిక్ ఇచ్చారు. ఆ రోజుల్లో పైన చెప్పుకున్న హీరోయిన్లు సినిమాలు వస్తున్నాయి అంటే సినిమా హిట్ .. ప్లాప్ అన్న టాక్ తో సంబంధం లేకుండా కుర్ర కారు లొట్ట లేసుకుంటూ వాళ్ల ను తెర మీద హాట్ గా చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టేవారు. అలాంటి వారిలో మమతా కులకర్ణి ఒకరు. బాలీవుడ్ హీరోయిన్ అయినా మమతా కులకర్ణి తెలుగులో ప్రేమశిఖరం సినిమాతో పాటు మంచి మోహన్ బాబు హీరోగా వచ్చిన దొంగ పోలీస్ సినిమాల్లో హీరోయిన్గా నటించారు. అప్పట్లో మమత అంటే ఒక హాట్ హీరోయిన్.
ప్రస్తుతం మమత వయసు 52 సంవత్సరాలు .. అయితే మమతకు ముంబై మాఫియాతో లింకులు ఉన్నాయని .. ఆమెకు కొందరు అండర్ వరల్డ్ డాన్ ల తో ఎఫైర్లు కూడా పెట్టుకుంది అన్న ప్రచారం గట్టిగా నడిచింది. కారణం ఏదైనా కొన్నేళ్లపాటు విదేశాల్లో ఉన్న ఆమె తిరిగి ఇండియాకు వచ్చేశారు. ప్రస్తుతం మమత సన్యాసం తీసుకున్నారు. తాజాగా ఆమె ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళాకు వచ్చారు. మహా కుంభమేళా సాక్షిగా సన్యాసిగా మారిపోయారు. కుంభమేళాకు రావడం సంతోషంగా ఉందని .. సన్యాసం స్వీకరించడం తన అదృష్టం అని పేర్కొన్నారు. ఆమె తన పేరు మమతానందగిరి సాధ్వి గా మార్చుకున్నారు. తాజాగా మమత చేసిన కామెంట్లు మమత సన్యాసిగా ఉన్నా ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.