టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కొన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే అతను మళ్లీ కల్కి సలార్ వంటి సినిమాలతో అదిరిపోయే కంబాక్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు ప్రభాస్ మరో సంచలన సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అదే 'స్పిరిట్'. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి కొన్ని అదిరిపోయే అప్‌డేట్స్ బయటకు వచ్చాయి.

'స్పిరిట్' సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఆర్ట్ డైరెక్టర్‌తో కలిసి ఇండోనేషియాలోని జకార్తాలో షూటింగ్ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఫస్ట్ షెడ్యూల్ జకార్తాలోనే స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ లీక్ అయింది. 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. కానీ కథ మొదట్లో తన క్యారెక్టర్ నెగిటివ్‌గా ఉంటుందట. ఆ తర్వాత పాజిటివ్‌గా మారుతుందట. ఇంకా స్టోరీ విషయానికొస్తే, ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతోందట. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా యాక్షన్ సీన్స్‌తో ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఈ న్యూస్ విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే మిగతా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ప్రభాస్‌కు విలన్‌గా వరుణ్ తేజ్ నటిస్తాడని కొన్ని రూమర్స్ వచ్చాయి. వరుణ్ కూడా ఈ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడని అన్నారు. కానీ వరుణ్ టీమ్ మాత్రం ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. మరోవైపు హీరోయిన్ విషయంలో అనుష్క శెట్టి పేరును పరిశీలిస్తున్నారట. కానీ ఇంకా ఏదీ అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.

మొత్తానికి 'స్పిరిట్' సినిమా ఒక థ్రిల్లింగ్ యాక్షన్ మూవీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఒకవేళ ఈ అప్‌డేట్స్ నిజమైతే, ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం పండగే పండగ. ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం వెయిట్ చేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: