- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


గత నెలలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రు. 1900 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. నార్త్ ఇండియా నుంచి ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఒక ఇండియన్ సినిమా ఎప్పుడు రాబట్ట‌ని వసూళ్లు పుష్ప 2 సినిమాకు ఉత్తర భారత దేశంలో వచ్చాయి. తెలుగు సినిమాలంటే అక్కడ ప్రేక్షకులకు మరింత క్రేజ్ క్రియేట్ అయ్యే విధంగా పుష్ప 2 సినిమా సూపర్ హిట్గా నిలిచింది. పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు అక్కడ తెలుగు సినిమాలుకు మార్కెట్ బాగా పెరిగింది. తాజాగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ డాకు మహారాజ సినిమా సూపర్ హిట్ అయింది.


సినిమా ఇప్పటికే 180 కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాను వెంటనే హిందీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా డాకు మహారాజ్ హిందీలో రిలీజ్ అయింది. నార్త్ థియేటర్లలో ఈ సినిమాను ముందుగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పుష్ప‌ పార్ట్ 2 సూపర్ డూపర్ హిట్ కావడంతో డాకు మహారాజుకు నార్త్ లో మంచి రిలీజ్ దక్కింది. ఏకంగా 500 కు పైగా థియేటర్లలో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేసినట్టు సమాచారం అందుతుంది.


ఇప్పుడు పుష్ప 2 సినిమా జోరు తగ్గింది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ కు కూడా నార్త్ లో మంచి రెస్పాన్స్ రావడంతో అక్కడ కూడా భారీ రిలీజ్ దక్కింది. ఏది ఏమైనా డాకు మహారాజ్ సినిమా నార్త్ లో కూడా బాగా క్లిక్ అయితే 200 కోట్లకు పైగా వసూళ్లు ఈజీగా రాబట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: