పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని ఆయన అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు.ఎందుకంటే బ్రో సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఈయనకు సంబంధించి ఒక్క సినిమా కూడా రాలేదు.అయితే బ్రో సినిమాలో పవన్ కనిపించినప్పటికీ హీరోగా కాదు..సాయి ధరంతేజ్ హీరో.కానీ కీరోల్ పోషించారు. అయితే పవన్ కళ్యాణ్ ఓజి,హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి మూడు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే రాజకీయాల్లో బిజీ అయిపోయి డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ తన సినిమాలన్ని పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల్లోనే సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. ఈ మేరకు సినిమాకి డేట్లు కూడా ఇచ్చారు. కానీ ఆ డేట్స్ ని సరిగ్గా వాడుకోవడం లేదని దర్శకనిర్మాతలపై ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ఓజి.. ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాతగా చేస్తున్నారు.

డివివి దానయ్య గతంలో రాజమౌళి దర్శకత్వం చేసిన ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా మూవీకి నిర్మాతగా చేశారు.ఇక ఆర్ఆర్ఆర్ మూవీకి భారీ బడ్జెట్ పెట్టిన దానయ్యకు అంతకంటే రెట్టింపు వసూళ్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే అంత పెద్ద సినిమాకి భారీ బడ్జెట్ పెట్టిన దానయ్య ఓజి సినిమాకి కూడా అదే రేంజ్ లో ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి దాదాపు 200 కోట్లకు మించి బడ్జెట్ పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ పూర్తిచేసుకున్నట్టు  టాక్. అలాగే 200 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి కూడా నేను రెడీగా ఉన్నానని, కానీ సినిమా అవుట్ ఫుట్ మాత్రం బాగుండాలి అని డివివి దానయ్య తరచూ డైరెక్టర్ కి చెబుతున్నారట.అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సమయం దొరికినప్పుడల్లా డేట్స్ ఇస్తున్నాడు.ఓజి మూవీ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక సుజిత్ గతంలో సాహో మూవీని తెరకెక్కించారు.అయితే సాహో మూవీ భారీ అంచనాలతో వచ్చినప్పటికీ సినిమా మాత్రం అంత బాలేదు.అయితే ప్రభాస్ రేంజ్ తో సినిమా కి కలెక్షన్లు వచ్చినప్పటికీ హిట్ అయితే కాలేదు. అయితే అలాంటి డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ ఓజీ అంటే కొంతమందిలో అనుమానమే ఉంది.కానీ ఇప్పటికే ఓజి సినిమా నుండి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పోస్టర్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. అలాగే ప్రస్తుతం రాజకీయాల్లో స్టార్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉన్నా సరే హిట్ చేయాలి అనే పనిలో పడ్డారు అభిమానులు.మరి చూడాలి భారీ బడ్జెట్ పెట్టి డివివి దానయ్య తెరకెక్కిస్తున్న ఓజి సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది..ఈ సినిమాతో నిర్మాత రిస్క్ లో పడతారా లేక లక్కీ అవుతారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. అలాగే శ్రియా శరన్, ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళు కీలకపాత్రల్లో నటిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: