ఇక అప్పటినుంచి ఈమె గురించి పలు రకాల వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా తన భర్తతో కలిసి హనీమూన్ కోసం థాయిలాండ్ కు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత ఒక బేటిలో కీర్తి సురేష్ తన వివాహ జీవితం గురించి ఒక ప్రశ్న ఎదురవ్వగా ఇప్పుడు తనకు చాలా ఆనందంగా ఉందని కారణం తామిద్దరం సుదీర్ఘకాలంగా డేటింగ్ లో ఉండడం వల్లే ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నామని తెలియజేసింది.
అందువల్ల తమకు పెద్దగా ఎక్కడ చేంజ్ కనిపించలేదని తాను ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటాను అది తన భర్తకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అయినా కూడా ఆయన ఇబ్బందిగా భావించడు అంటూ తనని అర్థం చేసుకోగల వ్యక్తి దొరకడం చాలా ఆనందం అంటూ తెలియజేసింది. అలాగే సంసార జీవితం కూడా చాలా సంతోషంగా కొనసాగుతోంది అంటూ కీర్తి సురేష్ చెప్పింది. అయితే ఇటీవలే బాలీవుడ్లో నటించిన బేబీ జాన్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతమైతే కీర్తి సురేష్ తన తదుపరి చిత్రాలను ఏవి అంగీకరించలేదు. ఈమె నటించిన రివాల్వర్ రీటా , కన్నివేడి వంటి చిత్రాలు త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమాలు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.