జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించారు. 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన ప్రతి చోట గెలిచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రికార్డు క్రియేట్ చేసింది. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా రికార్డు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఈయన నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ ఈ ఏడాది మార్చి 28న విడుదల కాబోతుంది. అయితే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత చాలా రోజులకు సోలోగా వస్తున్న మూవీ హరిహర వీరమల్లు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గత ఏడాది రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అలాంటి హరిహర వీరమల్లు సినిమాకి మెగా సూర్య ప్రొడక్షన్ లో ఏం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మాతగా చేస్తున్నారు. 

ఈ సినిమాకి నిర్మాత 200 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే 200 కోట్లు బడ్జెట్ సరే గాని మొదట ఈ సినిమాకి జాగర్లమూడి క్రిష్ వర్క్ చేశారు. కానీ ఈ సినిమా 70% పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీ అవ్వడంతో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏ ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకి డైరెక్టర్గా మారారు. అలా ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న విడుదల కాబోతుడడంతో అభిమానుల్లో భారీ అంచ్నాలు ఉన్నాయి.ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి మాట వినాలి అని పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాట విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా రెండు పార్ట్ లుగా వస్తుందని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు.

మొదటి పార్ట్ ఈ ఏడాదిలో వస్తుంది అయితే రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు. ఇక హరిహర వీరమల్లు మూవీ లో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. అయితే 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి డైరెక్టర్ మారడంతో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి.కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక విడుదలవుతున్న మొదటి సినిమా హరిహర వీరమల్లు కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని,ఇందులో అనుమాన పడాల్సిన అవసరమే లేదు అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: