ది రాజాసాబ్ సినిమాలో నా పాత్ర గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని ఆమె కామెంట్లు చేశారు. ఈ సినిమాలో నా పాత్రను ప్రేక్షకులు అస్సలు ఊహించలేరని నిధి చెప్పుకొచ్చారు. ప్రభాస్ హీరోగా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రిద్ధికుమార్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటిస్తుండటం గమనార్హం.
సంజయ్ దత్ ఈ సినిమాలో తాత పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. దర్శకుడు మారుతి ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ది రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర బాషల్లో సైతం విడుదల కానుందని సమాచారం అందుతోంది.
ది రాజాసాబ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ది రాజాసాబ్ సినిమా ఇతర భాషల్లో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ది రాజాసాబ్ కథ, కథనం కొత్తగా ఉంటాయని ఈ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.