టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెంకటేష్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఈ మూవీ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ సినిమాల కలెక్షన్లను దాటేసింది. ఇకపోతే కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది.

మూవీ టోటల్ బాక్సా ఫీస్ అండ్ కంప్లీట్ అయ్యే సరికి 95.27 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎనిమిది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 94.45 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే రంగస్థలం మూవీ కలెక్షన్లను బీట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అలా వెంకి "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో రంగస్థలం లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: