వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు భాషలో జనవరి 12 వ తేదీన విడుదల చేశారు.

మూవీ కి అద్భుతమైన టాక్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ , హిందీ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన కేవలం తెలుగు లో మాత్రమే విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను హిందీ లో కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో హిందీ ప్రేక్షకులు తెలుగు మూవీలను చాలా బాగా ఆదరిస్తున్నారు. అందులో ముఖ్యం గా తెలుగు నుండి వస్తున్న మాస్ మూవీ లకు అక్కడి ప్రేక్షకులు చాలా బాగా ఆదరణ చూపిస్తున్నారు.

డాకు మహారాజ్ సినిమాపై కూడా హిందీ ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతారు అని చాలా మంది జనాలు మొదటి నుండి అభిప్రాయపడుతూ వస్తున్నారు. ఇకపోతే తాజాగా విడుదల అయిన ఈ మూవీ హిందీ వర్షన్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. మరి హిందీ వెర్షన్ కి ఎలాంటి కలెక్షన్లు వస్తాయో ఈ మూవీ ఎరేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: