తెలుగు చిత్ర పరిశ్రమలో ఐటీ సోదాల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. ప్రధానంగా బడ నిర్మాతల సంస్థలో జరిగిన ఈ సోదాల్లో, ఒకరి దగ్గర ఫోన్లో ఎక్సెల్ షీట్ దొరికింది అన్న వార్త తెగ వైరల్ గా మారింది .. ఎక్సెల్ షీట్లు 2020 నుంచి ఇప్పటివరకు ఉన్న లావాదేవీలు లేదా 2020 - 21 మధ్యలో జరిగిన లావాదేవిలకు సంబంధించిన వివరాలు ఉన్నాయట . అలాగే ఇండస్ట్రీలోని చాలా బడా వ్యక్తులకు సంబంధించిన 10 సంస్థ‌ల‌ పేర్లు కూడా ఇందులో ఉన్నాయని అంటున్నారు ..


వైట్ ఇవ్వటం బ్లాక్ తీసుకోవటం లేదా బ్లాక్ ఇవ్వటం వైట్ తెచ్చుకోవడం వంటి ఈ లావాదేవీలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తుంది .. అలాగే వీటి మొత్తం విలువ దాదాపు రూ. 80 కోట్ల వరకు ఉంటుంద ని అంటున్నారు . ఇక ఇప్పుడు  ఈ వ్య‌వ‌హ‌రం లో రెండు పెద్ద‌ సమస్యల్లో ఉన్న‌యి అందులో ఒకటి , ఆ సంస్థ ఈ లావాదేవీలన్నిటి కీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది .. అలాగే వాటి కి సంబంధించిన కారణాలు కూడా చూపించాల్సి ఉంటుంది ..


 ఇక రెండవది ఈ లావాదేవీల్లో సంబంధం ఉన్న నిర్మాణ సంస్థలు అన్నిటి మీద ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ‌ అధికారుల  కన్ను పడుతుంది .. కచ్చితం గా ఆ సంస్థ‌ల‌ అకౌంట్లో చూడటం లేదా ఆ సంస్థల కు నోటీసులు ఇవ్వడం కచ్చితం గా జరగనుంది . ఇక టాలీవుడ్ లో ఇలా వ‌రుస‌పెట్టి సినిమాల లను నిర్మించే ఓ పెద్ద పేరున్న సంస్థ‌ ఈ లావాదేవీల్లో ఉన్నట్టు తెలుస్తుంది .. ఇంకెవరి పేర్లైనా ఉన్నాయా ? ఈ వ్యవహారం లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అని ఆరా  తీయటం లో బిజీగా ఉన్నారు మిగిలిన సినిమా నిర్మాతలు ..

మరింత సమాచారం తెలుసుకోండి: