టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన నటుడిగా కెరియర్ను కొనసాగించిన వారిలో శ్రీహరి ఒకరు. శ్రీహరి ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే మరెన్నో సినిమాల్లో విలన్ పాత్రలలో కూడా నటించాడు. అలాగే చాలా సినిమాల్లో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో కూడా నటించాడు. ఇకపోతే శ్రీహరి కొన్నాళ్ల క్రితమే మరణించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ , సమంత హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాను  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , శ్రీహరి కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకోవడం , ఈ సినిమాలో శ్రీహరి పాత్రకు అద్భుతమైన స్కోప్ ఉండడం , అలాగే ఈ సినిమాలో ఆయన తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోడం వల్ల ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే బృందావనం సినిమాలో శ్రీహరి పాత్రకు మొదట వేరే నటుడిని అనుకున్నారట. ఆయన ఆ పాత్రను రిజెక్ట్ చేయడం ద్వారా శ్రీహరికి ఆ అవకాశం వచ్చిందట.

ఇకపోతే ఈ మూవీ బృందం మొదట శ్రీహరి పాత్రకు జగపతిబాబును అనుకుందట. అందులో భాగంగా ఆయనను సంప్రదించి కథలు కూడా వివరించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పాత్రను రిజెక్ట్ చేశాడట. దానితో శ్రీహరిని మూవీ బృందం సంప్రదించగా ఆయన మాత్రం ఏ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా జగపతిబాబును బృందావనం మూవీ లో మొదట అనుకోగా ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో శ్రీహరిని మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: