టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ గా కెరియర్ ఎన్నో సంవత్సరాల పాటు ముందుకు సాగించిన ముద్దుగుమ్మలలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి , ఆ తర్వాత చందమామ మూవీ తో కమర్షియల్ విజయాన్ని అందుకొని , ఆ తర్వాత మగధీర సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

ఇక స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా అలాగే చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కూడా ముందుకు సాగించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఎన్నో కమర్షియల్ సినిమాలతో విజయాలను అందుకున్న లేడి ఓరియెంటెడ్ సినిమాతో మాత్రం ఇప్పటి వరకు సాలిడ్ విజయాన్ని అందుకోలేకపోయింది. తనతో పాటు కెరియర్ను మొదలు పెట్టి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇప్పటికే ఎన్నో లేడి ఓరియెంటెడ్ సినిమాలలో నటించి చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్న వారు ఉన్నారు. కానీ కాజల్ మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న వాటి ద్వారా సరైన ఫలితాలను అందుకోవడం లేదు. తాజాగా ఈ బ్యూటీ సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఈ సినిమాతో అయిన కాజల్ కి సూపర్ సాలిడ్ విజయం లేడీ ఓరియంటెడ్ మూవీ ద్వారా దక్కుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే కాజల్ ఎన్నో సినిమాల్లో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ బ్యూటీ సినిమాల్లో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: