ఇప్పుడు తాజాగా తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్న చిత్ర బృందం తెలుగు ట్రైలర్ ని కూడా హీరో వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సి సుందర్ దర్శకత్వ వహించగా.. సంతానం, ఆర్య, సోను సూద్ లాంటివారు నటించారు. 2012 నుంచి ఈ సినిమాకి బ్రేకులు పడుతూనే ఉన్నాయట. అయితే ఎట్టకేలకు సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా భారి కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ సినిమాని ఈనెల 31న రిలీజ్ చేయబోతున్నారు..
ఇందులో హీరోయిన్స్ గా వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ అంజలి ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారు. విశాల్ సంతానం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా హైలెట్గా నిలుస్తున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో గ్లామర్ తో మరొకసారి హైలెట్గా నిలిచింది. సంతానం కామెడీ టైమింగ్ తో కూడా ఈ సినిమాని కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఆర్య డైలాగులు కూడా కనిపిస్తున్నాయి. తెలుగులో సంక్రాంతికి విడుదల చేయాలని చూసిన టాలీవుడ్ బడా చిత్రాలు విడుదలవడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. మరి తెలుగులో ఈ నెల 31న విడుదల కాబోతున్న మదగజరాజా సినిమా ఏ విధంగా మెర్పిస్తుందో చూడాలి.