మన సౌత్ చిత్ర పరిశ్రమలో ఎందరో అగ్ర హీరోలు ఉన్నారు .. ప్రధానిగా కోలీవుడ్ లో రజినీకాంత్ నుంచి శివ కార్తికేయన్ వరకు ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు .. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో రజినీకాంత్ ను మించిన స్టార్‌డ‌మ్‌ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది దళపతి విజయ్ ఒక్కడే .  ఈ స్టార్ హీరో రాజకీయాల్లో బిజీ కాబోతున్నాడు .. ఇప్పటికే తన రాజకీయ పార్టీని ప్రారంభించి వచ్చే తమిళనాడు ఎలక్షన్ లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు .. ఇప్పటికే తను సినిమాలు కూడా మానేస్తున్నట్టు కూడా ప్రకటించాడు .. తాను చివరగా నటించే విజయ్ 69 సినిమాను కూడా త్వరగా షూటింగ్ ముగించి సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నాడు ..


అయితే ఇప్పుడు ..  విజయ్ నటిస్తున్న 69వ సినిమాకు ఆయన నటించిన మొదటి సినిమా నాలయ్య తీర్పు  అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది .. అయితే దళపతి విజయ్ ఇదే సినిమా టైటిల్ తో వచ్చిన సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. చివరి సినిమా అని చెప్పుకుంటున్న విజయ్ 69 కు ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారని కూడా అంటున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిపబ్లిక్ డే కనుక రేపు రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.


ఇదే క్రమంలో దళపతి విజయ్ మరో సినిమాకు కమిట్ అయ్యాడనే ఓ గాసిప్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . బిజ‌య్ 69  సినిమా షూటింగ్  వ‌చ్చే ఆగస్టులోపులో కంప్లీట్ కాబోతుంది.. ఈ తరుణంలో విజయ్ మరో సినిమాలో నటించబోతున్నారని కూడా అంటున్నారు .. అయితే అది విజయ్ హీరోగా కాకుండా ఓ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట .. ఆ సినిమానే విజయ్ చివరి సినిమా అని దళపతి సన్నిహితులు అంటున్నారు .. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు కూడా బయటకి వస్తాయని తెలుస్తుంది. మరి దళపతి విజయ్ సినిమాలలో రాజుగా వెలిగిన రాజకీయాల్లో కూడా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: