భాషతో సంబంధం లేకుండా జాన్వీ కపూర్ కెరీర్ పరంగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండగా జాన్వీతో పోటీ గురించి ఖుషి కపూర్ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ తో పోటీ గురించి ఆలోచన మా ఇద్దరికీ లేదని ఖుషి కపూర్ అన్నారు. మేము పోటీ పడుతున్నామని అనుకోవడం వింతగా ఉందని ఆమె తెలిపారు.
 
ఒకవేళ మేమిద్దరం కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేస్తే తను నాకంటే బాగా చేయొచ్చని ఖుషి కపూర్ వెల్లడించారు. దానిని కూడా నేను సక్సెస్ గానే భావిస్తానని ఆమె పేర్కొన్నారు. అక్క కూడా అంతేనని ఖుషి తెలిపారు. నేను ఏదైనా మూవీలో బాగా యాక్ట్ చేసి ప్రశంసలు అందుకుంటే అది తన విజయంగా చూస్తుందని ఖుషి కపూర్ పేర్కొన్నారు. అంతే తప్ప మా ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోమని ఖుషి కపూర్ చెప్పుకొచ్చారు.
 
తమిళ, తెలుగు భాషల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన లవ్ టుడే సినిమా హిందీలో లవ్ యాపా పేరుతో రీమేక్ అయింది. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం. ఈ సినిమాకు ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి నెల 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఖుషి కపూర్ కు రెండో మూవీ కావడం గమనార్హం.
 
జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోగా ఖుషి కపూర్ కూడా ఈ జాబితాలో చేరతారేమో చూడాల్సి ఉంది. 2023 సంవత్సరం నుంచి ఖుషి కపూర్ కెరీర్ బిజీగా ఉన్నారు. ఖుషి కపూర్ తెలుగు ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: