సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో చేయబోయే సినిమా త్వరలోనే షూటింగ్ కు వెళ్ళబోతుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానుల కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. రాజమౌళి ఈసారి మహేష్ తో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నాడు .. ఇప్పటికే ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా ఉంటుందని అంటున్నారు .. అంతేకాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా బయటికి వస్తున్నాయి .. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరోపక్క ఈ సినిమాలో రాజమౌళి రామాయణం టచ్ కూడా ఇవ్వనున్నారని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.
 

అలాగే ఈ సినిమాల్లో నటించే హీరోయిన్స్ గురించి కూడా ఎన్నో వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి .. మొదటలో హాలీవుడ్ హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తుందని వార్తలు బయటికి వచ్చాయి .. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందని వార్త తెరపైకి వచ్చింది .. ఇక ఇప్పుడు రీసెంట్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందని గట్టిగా వినిపిస్తుంది .. ఇక రీసెంట్ గానే ఈ ముద్దుగుమ్మ హైదరాబాదులో కూడా ల్యాండ్ అయింది .. ఇప్పటివరకు అమెరికాలో ఉన్న ప్రియంక సడన్గా హైదరాబాదులో అడుగుపెట్టడంతో ఆమె మహేష్ సినిమా కోసమే వచ్చిందని అందరూ ఫిక్స్ అయ్యారు.

 

అయితే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా గురించి చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు రాజమౌళి.   ఈమధ్య కెన్యా అడవుల్లో లొకేషన్స్ వేటకు వెళ్లాడు రాజమౌళి .. అలాగే ఆ తర్వాత ఓ సింహం ఫోటోకు మహేష్ బాబును ట్యాగ్ చేశాడు .. ఈ పోస్ట్ సోషల్ మీడియాని విపరీతంగా షేక్‌ చేసింది .. అంతేకాకుండా సినిమాపై అంచనాలను ఊహించని రేంజ్ కు తీసుకువెళ్లింది .. అయితే ఇప్పుడు జక్కన్న మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి షేర్ చేశాడు .. ఈ పోస్టులో సింహాన్ని లాక్ చేస్తున్నట్టు చెప్పాడు అంతేకాకుండా ఆయన పాస్పోర్ట్ కూడా చూపించాడు. దానికి అర్థం పాస్పోర్ట్ లాక్కుని సింహాన్ని లాక్ చేశాని.   మహేష్ బాబు ఎప్పుడు సమయం దొరికిన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ తీసుకుని రాజమౌళి సీజ్ చేసి షూటింగ్ కోసం ఆయన్ను బ్లాక్ చేశాడని హింట్ ఇస్తు ఈ ఆసక్తికరమైన పోస్టును సోషల్ మీడియాలో పెట్టాడు.   అయితే జక్కన్న  పోస్టుకు మహేష్ కూడా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు .. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ డైలాగ్ ఇచ్చాడు మహేష్ .. అంతేకాకుండా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అని రిప్లై కూడా ఇచ్చింది .. దీంతో ఈ పోస్ట్ సోషల్  మీడియాను తెగ షేక్ చేస్తున్నాయి. ఇక మరి రాజమౌళి మహేష్ ను ఈ సినిమాలో ఏ విధంగా చూపిస్తారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: