చిత్ర పరిశ్రమలో ఉండే చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు మించి భారీ క్రేజ్ సంపాదించుకుంటున్నారు .. అలాగే కొంతమంది ప్రేక్షకులు కేవలం హీరోయిన్స్ కోసమే సినిమాలకు వెళ్లే వారు కూడా ఉన్నారు .. ఈ రీసెంట్ డేస్ లో చాలామంది హీరోయిన్లు ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోయారు .. అంతేకాకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు .. మరి కొంతమంది హీరోయిన్లు స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు ..  ఇప్పుడు సినిమాలో నటించే హీరోయిన్స్ మాత్రమే కాదు బుల్లితెరపై నటించే సీరియల్ బ్యూటీలు కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో తెగ ఫేమస్ అయిపోతున్నారు .. హీరోయిన్లను మించిన క్రేజ్‌ తెచ్చుకున్న భామలు కూడా చాలామంది ఉన్నారు .. 


తాజాగా ఇప్పుడు ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో స్టార్‌డం తెచ్చుకుంది . ఎంతలా అంటే అంతా ఇంతా కాదు ఏకంగా స్టార్ హీరోలకు మించి ఫాలోవర్స్ ను పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ .. అలాగే ఈ బ్యూటీ ఆస్తిపాస్తులు కూడా స్టార్ హీరోలకు మించి పోయే రేంజ్ లో ఉన్నాయి .. ఇంతకు ఈ బ్యూటీ ఎవరంటే. ఈ అమ్మాయి వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే .. కానీ ఈమె ఆస్తి సుమారు 250 కోట్లు పైనే .. ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోయిన్స్ కూడా ఇంత సంపాదించలేదు. అంతేకాకుండా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సీరియల్ నటి కూడా ఈమె .. ఇంతకు ఈ ముద్దుగుమ్మ పేరు ఏమిటంటే .. బాలీవుడ్ నటి జన్నత్ జుబేర్ .. చిన్న వయసులోనే ఈ ముద్దుగుమ్మ తిరుగులేని స్టార్డం తెచ్చుకుంది .. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ కి భారీ క్రేజ్ ఉంది .. ఈమెను ఫాలో అయ్యేవారు మిలియన్స్ లో ఉన్నారు .. సోషల్ మీడియా ఫాలోవర్స్ లో ఈమె షారుక్ ఖాన్ ను కూడా దాటేసింది.
 

ఇక జన్నత్ జుబేర్ కు ఇన్‌స్టాగ్రామ్ లో ఏకంగా 49.7 మిలియన్ల మంది ఫాలోవెర్లు ఉన్నారు .. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై కెరియర్ మెద‌లు పెట్టిన ఈ బ్యూటీ .. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ గా ఎదిగింది .. బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ .. అదేవిధంగా రాణి ముఖర్జీ హీరోయిన్గా నటించిన  ‘హిచ్కీ’ లో జన్నత్ నటించింది .. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలో నటించి మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ .. ఇక జన్నత్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు భారీ క్రేజ్ ఉంది .  ఆమె సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేస్తే చాలు ఇంటర్నెట్ షేక్ అవ్వాల్సిందే .. ఇలా కేవలం బుల్లితెర సీరియల్స్ ద్వారానే స్టార్ హీరోయిన్లు  మించిన రేంజ్ లో ఈ బ్యూటీ స్టార్డం తెచ్చుకుంది. ఇక మరి రాబోయే రోజుల్లో జన్నత్ బాలీవుడ్ హీరోయిన్గా ఏమైనా సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: