విశ్వక్ సేన్ లేడీ పాత్రలో నటిస్తున్న తాజా మూవీ లైలా..ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో అచ్చం అమ్మాయి లాగే కనిపిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ఒక పాటని రిలీజ్ చేశారు.అయితే ఈ పాట రిలీజ్ చేసిన ఈవెంట్లో విశ్వక్ సేన్ ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ సినిమాలో నా లేడీ గెటప్ చూసి అలా వదిలేయండి.. అంతేకానీ దానికోసం మాత్రం వాడకండి రా బాబోయ్ అన్నట్లుగా మాట్లాడారు. ఇక విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటో తెలిసిన చాలామంది నవ్వుకున్నారు. ఇక ఇదే ఈవెంట్లో విశ్వక్ సేన్ కి జర్నలిస్ట్ నుంచి షాకింగ్ కామెంట్లు ఎదురయ్యాయి. 

మిమ్మల్ని లేడీ గెటప్ లో చూస్తే అచ్చం KPHB ఆంటీ లా ఉన్నారు అంటూ పరువు తీసేశారు. ఇక జర్నలిస్టు మాటలకు షాక్ ఆయన విశ్వక్ సేన్ Kphb ఆంటీ అంటున్నారేంటి.. ఇంటర్నేషనల్ ఫిగర్ అంటారనుకుంటే మీరేంటి ఇలా అన్నారు ఎంత అన్యాయం అంటూ విశ్వక్ సేన్ బదులిచ్చారు. ఇక జర్నలిస్టు మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో మీడియా వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో హద్దులు మీరి మాట్లాడుతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఇక విశ్వక్ సేన్  గత ఏడాది మెకానిక్ రాఖీ మూవీతో నిరాశపరిచినప్పటికీ ఈ సంవత్సరం లైలా మూవీతో హిట్టు కొట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో ఎంత అద్భుతంగా ఉన్నారో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని విశ్వక్ సేన్ ని చూస్తే శివ కార్తికేయన్ రెమో మూవీ గుర్తుకు వస్తుందని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ ప్రధాన పాత్రల్లో వస్తున్న లైలా మూవీకి సాహు గారపాటి నిర్మాతగా చేస్తున్నారు. అలాగే ఈ మూవీని రాం నారాయణ్ తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: