పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాడు. అతి చిన్న వయసు నుంచి హీరోగా పరిచయమైన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఎప్పటికప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ అభిమానులకు చేరువలో ఉంటాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో స్పిరిట్ ఒకటి. 


ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించగా.... టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా హై బడ్జెట్ తో స్పిరిట్ సినిమాను నిర్మిస్తున్నారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా యంగ్ బ్యూటీ రాశి కన్నా హీరోయిన్ గా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే కీ రోల్ లో సైఫ్ అలిఖాన్, కరీనాకపూర్ నటించనున్నట్లు లోకల్ సర్కిల్స్ లో సమాచారం అందుతుంది. ఇక రాశి ఖన్నా ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోందని తెలియగానే ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక స్పిరిట్ సినిమా షూటింగ్ ఈ సంవత్సరంలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారనే సమాచారం అందుతుంది. అయితే ప్రభాస్ పాత్రలో కొంత నెగిటివ్ షెడ్ కూడా ఉంటుందట. ఆ తర్వాత పాజిటివ్ గా సినిమా టర్న్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు స్పిరిట్ సినిమా బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.


డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం అందుతుంది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా గురించి ఈ సినిమాలో చర్చించబోతున్నారని పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్డ్రగ్స్ మాఫియా పై పోరాడబోతున్నట్లుగా ఈ సినిమా కథ ఉంటుందట. ఈ సినిమా కథ తెలిసి ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాను త్వరలోనే విడుదల చేయాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: