రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా.... దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. దిల్ రాజు తన కెరీర్ లో ఇప్పటివరకు ఎప్పుడు పెట్టని విధంగా హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్ తో గేమ్ చేంజర్ సినిమా రూపొందించారు. కానీ ఈ సినిమా నష్టాల బాట పట్టిందని సమాచారం అందుతోంది.
గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విడుదలైన మొదటి రోజు నుంచే యావరేజ్ టాక్ తెచ్చుకోగా పెద్దగా రాణించలేకపోయింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఇతర సినిమాలతో గేమ్ చేంజర్ సినిమా పోటీ పడలేకపోయింది. కాగా, ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ రామ్ చరణ్ తన తదుపరి సినిమా షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో ఆర్సి 16 సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కొన్ని కీలకమైన రెండు షెడ్యూల్స్ లను ముగించుకున్నారు. తదుపరి షెడ్యూల్ ను ఫిబ్రవరి నెలలో ప్లాన్ చేశారు. గేమ్ చేంజర్ ఫలితం నేపథ్యంలో ఆర్సి 16 సినిమాను చాలా త్వరగా పూర్తిచేసి ఇదే సంవత్సరంలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ లో ఉన్నారట. రామ్ చరణ్ ను రంగస్థలంలోని చిట్టిబాబు రూపంలో దర్శకుడు బుచ్చిబాబు చూపించబోతున్నారనే వార్తలు సైతం వస్తున్నాయి. ఈ సినిమాను పల్లెటూరి నేపథ్యంలో జరిగే పీరియాడిక్ కథతో రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది.
కాగా, ఈ సినిమాను రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యేవరకు ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ గేమ్ చేంజర్ సినిమాలో డైరెక్టర్ శంకర్ కొన్ని తప్పులు చేశాడు. తన దర్శకత్వం బాగోలేదనే వార్తలు సైతం వినిపించాయి. అయితే అలాంటి తప్పులు జరగకుండా బుచ్చిబాబు చాలా జాగ్రత్తగా ఆర్సి 16 సినిమాను చేయాలని అనుకుంటున్నారట. అలా అయితేనే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని వార్తలు సైతం వస్తున్నాయి. బుచ్చిబాబు ఇదివరకే దర్శకత్వం వహించిన మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోగా.... తన రెండో సినిమాగా రామ్ చరణ్ తో కలిసి చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు సంతోషంలో ఉన్నారు.