సూపర్ స్టార్ మహేష్ బాబు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ - తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చెప్పే మాట ఇది. రిహార్సల్స్ అవసరం లేకుండా ఎటువంటి భారీ డైలాగ్ అయినా సరే చెప్పగల సమర్థులు ఆయన.ఇదిలావుండగా మహేష్, రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలై చాలా రోజులు అయింది. ఆ మధ్య అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజతో లాంఛనంగా సినిమాను ప్రారంభించారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అద్భుతమైన అప్డేట్ వదిలారు జక్కన్న. సూపర్ స్టార్ మహేష్ బాబు.. జక్కన్న బోనులో బందీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొన్నాళ్లపాటు ఆయన హ్యాండ్ ఓవర్లోనే మహేష్ బాబు ఉండాలి. అందుకే ఆయన పాస్ పోర్ట్ లాగేసుకొని, ఇక నో మోర్ వెకేషన్ అన్నట్లు ఒక వీడియోని జక్కన్న షేర్ చేశారు.

ఆ వీడియోలో ఏముంది అనే విషయానికొస్తే.. సింహాన్ని లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా  ఆ వీడియో ఉంది. సింహాన్ని లాక్ చేసిన తర్వాత పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చారు జక్కన్న. దీంతో ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ షురూ అయిందని, ఇక మహేష్ బాబుకి అబ్రాడ్ వెకేషన్స్ లేవని స్పష్టం అవుతోంది.ఈ క్రమంలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ప్రియాంక లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఇప్పుడు రాజమౌళి పోస్టుకు ఆమె స్పందించడంతో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఫిక్సైనట్లేనని అంటున్నారు. అయితే.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్లు భాగంగా కానున్నట్లు ఇప్పటికే రాజమౌళి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: