ఇప్పటివరకు కేవలం చిన్న సినిమాలకే దర్శకత్వం వహించిన మారుతి ఏకంగా ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా సినిమాని తీస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లు లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ ని ఎప్పుడూ చూడని విధంగా హర్రర్ కామెడీ జోనర్ లో చూడబోతున్నాము. ఈ విషయం తెలిసి ది రాజాసాబ్ సినిమాపై భారీ హైప్ పెరుగుతోంది.
ఈ సినిమా 2025 ఏప్రిల్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోందని సమాచారం. కానీ చిత్ర బృందం సినిమా రిలీజ్ డేట్ కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ప్రభాస్ అభిమానులు కాస్తా నిరాశ చెందుతున్నారు. ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ తరసన హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్దీ కుమార్ నటిస్తున్నారు.
వీరితోపాటు లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది. కాగా, ఈ సినిమాను రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. దీంతో మారుతి ఇంత భారీ బడ్జెట్ తో ఎప్పుడు సినిమాని తీయకపోవడంతో ది రాజా సాబ్ సినిమాను చాలా జాగ్రత్తగా చేయాలని ఆలోచనలో ఉన్నారట. మారుతి సినిమాలు చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.